ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : పెద్దపంజణి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎన్.రెడిప్ప లాయర్ మరియు ఎంపీపీ చిన్నాన్న తనయుడు శ్రీ జల్లిపేట బాబు గుండెపోటుతో మరణించడంతో గురువారం గంగినాయన పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త ఇండ్లు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపంజాణి మండలం ఎంపీపీ ఏం.రెడ్డప్ప, బైరెడ్డిపల్లి మండలంలోనిలక్కనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి శ్రీనివాసులు బాబు మృతదేహానికి అశృనివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. మండల జడ్పిటిసి కేశవులు శరవాణి ద్వారా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.










