- మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
ప్రజాశక్తి-ఉరవకొండ(అనంతపురం): వైస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా ఓబులేసు నిబద్ధతకు..మంచితనానికి మారుపేరుగా నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కొనియాడారు.వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ పట్టణ అధ్యక్షుడు,రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ స్వర్గీయ చల్లా ఓబులేసు సంస్మరణ సభను ఆదివారం వైస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక ఉరగాద్రి కళ్యాణ మండపం నందు జరిగింది.మాజీ జెడ్పిటిసి తిప్పయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి,రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న,బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ,పార్టీ బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న,ఓబులేసు కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.ముందుగా ఓబులేసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జరిగిన సంస్మరణ సభలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఒక నిముషం పాటు మౌనం పాటించారు.ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఓబులేసుతో తనకున్న సాన్నిహిత్యన్ని గుర్తుకు చేసుకున్నారు.విద్యార్థి సంఘం నాయకుడుగా.. ఉద్యోగం వచ్చాక బ్యాంక్ ట్రేడ్ యూనియన్ నేతగా రిటైర్మెంట్ తరువాత వైస్సార్సీపీ లీడర్ గా పనిచేసి అందరి మన్ననలు పొందారన్నారు.ఆయన మృతి తీవ్రమయిన బాధ,తీరని లోటు కలిగించాయన్నారు.పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను నేతలు కొనియాడారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తూ స్వలాభం కాకుండా ఎదుటివారికి కష్టమొచ్చిన తన సొంత పనిగా భావించేవారన్నారు.ఓబులేసు మరణం వైస్సార్సీపీకి తీరని లోటు,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని నేతలు కోరుకున్నారు.ఆలాగే ఓబులేసు కుటుంబ సభ్యులకు తాము ఎప్పుడు అండగా ఉంటుందని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరసింహులు,జెసిఎస్ మండల కన్వీనర్ తేజనాథ్,పెన్నహోబిలం దేవాలయం మాజీ చైర్మన్ అశోక్ కుమార్,గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ రీజినల్ మేనేజర్ రంగన్న,రిటైర్డ్ మేనేజర్లు గోవిందరెడ్డి,బాలకృష్ణ,సుబ్బరాయుడు,ఫక్రుద్దీన్,మాజీ ఎంపీపీలు ఏసి ఎర్రిస్వామి,నాగేశ్వరరావు,రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత కృష్ణప్ప,శ్రీనివాసులు ప్రజాప్రతినిధులు,వైస్సార్సీపీ నాయకులు,ఓబులేసు,ఎర్రిస్వామి,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.










