Apr 24,2023 16:59

ప్రజాశక్తి-కాళ్ల  : ఉండి మాజీ ఎమ్మెల్యేపాతపాటి సర్రాజు  ఆప్యాయతకు మారు పేరని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు భీమవరం ఆదర్శ్ నగర్ లో పాతపాటి సర్రాజు స్వగృహంలో సర్రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. ఉండి మాజీశాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ స్వర్గీయ పాతపాటి సర్రాజు కుటుంబాన్నిరాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగామంత్రి ప్రసాదరావు మాట్లాడుతూ పాతపాటి సర్రాజు నిబద్ధతతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పాతపాటి వెంకట శ్రీనివాసరాజు(వాసు) మంత్రి ప్రసాదరావుకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. పరామర్శించిన వారిలో భీమవరం శాసన సభ్యులు గ్రంధి శ్రీనివాస్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్, ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్  డీసీసీబీ చైర్మన్ పివిఎల్ నరసింహరాజు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డ్ మెంబర్ గోకరాజు రామరాజు, వైసీపీ నాయకులు కుమార్ దత్తాత్రేయ వర్మ, గాదిరాజు సుబ్బరాజు, మేకా పార్వతి, ఆర్ డి వో దాసి రాజు, జిల్లా సర్పంచ్ ల ఛాంబర్ అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, ఆకివీడు మున్సిపల్ చైర్ పర్సన్ జామి హైమావతి, తదితరులు పాల్గొన్నారు.