ప్రజాశక్తి-నార్పల : విద్యాప్రదాత ఫాదర్ ఫెర్రర్ 103వ జయంతి సందర్భంగా నాయన పల్లి గ్రామంలో బి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారుఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ కటిక కరువు నేలపై విద్యాభివృద్ధికి, వైద్య సహాయానికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడిన అమృత మూర్తి ఫెర్రర్ అని తెలిపారు. అనంతపురం జిల్లాలో విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేమని అన్నారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, పేద విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకునేలా కార్పొరేట్ కళాశాలలో చదువులు చెప్పించారని గుర్తుచేసుకున్నారు. స్పెయిన్ దేశం నుంచి వచ్చి భారతదేశంలోని అనంతపురం జిల్లాను రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి ద్వారా విద్యకు సంబంధించిన స్కూల్లు, వైద్యానికి అధునాతనమైన హాస్పిటల్, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇచ్చారనీ,మహిళలకు యువకులకు తమ సొంత కాళ్ళ మీద నిలబడేలా వృత్తి విద్యలు, ఏర్పాటు చేశారన్నారు. కరువు నేలలో దాగి ఉన్న క్రీడాకారులను దేశానికి పరిచయం చేసినది ఆర్డిటి సంస్థ ద్వారా ఫెర్రర్ గారేనని అన్నారు. ఆయన మరణించినా కూడా ఇప్పటికీ అనంతపురం జిల్లాలోని నిరుపేదల ఇళ్లల్లో దీపమై నిలిచారని అతనే నిజమైన మానవతా మూర్తి అని అన్నారు ఆయన జన్మదినం సందర్భంగా నివాళులర్పించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నటువంటి వారసులను ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జయరాం, శివయ్య, సూర్యనారాయణ రెడ్డి, రమణయ్య, రామకృష్ణ, గంగయ్య, ప్రసాద్ ,వీరప్ప, రామాంజనేయులు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.










