Jun 02,2023 15:32
  • పాలకోడేరు జడ్పిటిసి లక్ష్మి తులసి సుబ్రహ్మణ్యం 

ప్రజాశక్తి-పాలకోడేరు : బాలికల బంగారు భవిష్యత్ కు కళాశాల చదువు ఎంతో అవసరమని పాలకోడేరు జడ్పిటిసి  పెద్ది శెట్టి లక్ష్మీ తులసి సుబ్రహ్మణ్యం అన్నారు. పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఏర్పాటు చేసిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.మహేష్ బాబు అధ్యక్షత వహించగా జడ్పిటిసి లక్ష్మీ తులసి సుబ్రమణ్యం మాట్లాడారు. బాలికల విద్యకు పూర్తి భరోసాను ప్రభుత్వం కల్పించేందుకు మండలానికో బాలికల జూనియర్ కళాశలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఏర్పాటు చేసారని ప్రధానోపాధ్యాయులు పి.మహేష్ బాబు అన్నారు. దీనిలో  భాగంగా  పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్లస్ టు పేరుతో జూనియర్  కళాశాలను  ఈ విద్యా సంవత్సరం  నుంచి ప్రారంభించడం జరిగింది అన్నారు. విద్యా కమిటీ ఛైర్మన్ మస్తాన్ రావు,  కో ఆప్టెడ్ సభ్యులు ఆళ్ళ నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు పి.మహేష్ బాబు మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం అందిస్తున్న ప్రోత్సాహాకాలను వివరించరు. ఈ కళాశాలలో బై.పి.సి, సి.యీ.సి.గ్రూపులతో బోధన జరుగుతుందని తెలిపారు. బోధనా రంగంలో ఇరవై ఏళ్ల అనుభవమున్న తొమ్మిది మంది లెక్చరర్స్ తో విద్యా బోధన చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు పదిమంది బాలికలు కళాశాలలో చేరారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ లెక్చరర్ వసంత కుమార్, గ్రామస్థులు లక్ష్మీపతి, విద్యా కమిటీ సభ్యులు కనకారావు, జ్యోతి, కౌసల్య,  లెక్చరర్స్ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.