May 07,2023 16:49

ప్రజాశక్తి - పెనుమంట్ర : మండల ప్రత్యేక అధికారి, మండల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి, రైతులకు భరోసా నివ్వాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. ఆదివారం మార్టేరులో రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టరు ఆకస్మిక తనిఖీలు చేశారు. రిజిస్టర్లు, తేమ శాతం చూసే యంత్రాన్ని, స్టాకును తది తర వాటిని జిల్లా కలెక్టరు నిశితంగా పరిశీలించారు. ఈ ఆర్ బి కె లో ఇంతవరకూ ఎంతమంది రైతులు వచ్చారు. ఎంత ధాన్యం కొనుగోలు చేశారని అధికారులను జిల్లా కలెక్టరు అడగగా ,150 మంది రైతులు వచ్చారని,1032 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామని,130 మంది రైతులు సుమారు 260 ఏకరాలు వరి కోతలు కోయ్యవలసి ఉందని జిల్లా కలెక్టరుకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని ఏవ్వరూ ఆందోళన చెందవద్దని కలెక్టరు అన్నారు. రైతులు రైస్ మిల్లలు దగ్గరకు వెళ్ళుట గాని వారిని సంప్రదించటం గాని చేయనవసరం లేదని  అన్నారు.ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద వి ఆర్ వో , వీఏఏ,పంచాయతీ కార్య దర్శి, సీనియర్ ఇన్స్పెక్టర్, సహకార శాఖ సిబ్బంది , ఇతర అధికారులను నియమించడం జరిగిందని కలెక్టరు తెలిపారు. రైతులు అవసరమైన గోనే సంచులు,హమాలీలు ,వాహనాలను రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారుు. రైతులకు సకాలంలో డబ్బులు బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఒకసారి ట్రక్ షీట్ జనరేట్ అయిన తర్వాత రైతులు ఏవ్వరూ రైస్ మిల్లులకు వెళ్ళవలసిన అవసరం లేదని సదరు విషయం సంబంధిత అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆమె అన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగిన జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబరు 8121676653కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేసినట్లయితే తక్షణమే పరిష్క రించడం జరుగుతుందని తెలిపారు. అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసు కుందని అందుకు అనుగుణంగా అధికారులు,సిబ్బంది కలసి భాద్యతగా పనిచేయాలని కలెక్టరు సూచించారు. ఆన్లైన్ ,ఆఫ్ లైన్ విధానంలో కూడా ధాన్యం కొనుగోలు చేయుటకు ఆదేశాలు జారీ చేశామని ,ఆఫ్ లైన్ లో కొన్న ధాన్యాన్ని సాయంత్రం కల్లా ఆన్లైన్ చేయాలన్నారు.ఏక్కడ రోడ్లపక్కల ధాన్యం ఉండకుండగా ఎప్పటి కప్పుడు ధాన్యం కొనుగోలు చేసి తరలించాలని అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లను ఎవర్ని ఉపేక్షించేది లేదని, అటువంటి రైస్ మిల్లులను గుర్తించి సీజ్ చేయడం జరిగిందని కలెక్టరు అన్నారు.సెలవు దినాలలో కలిపి పది రోజులు పాటు ప్రత్యేక అధికారులు, అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా చూడాలని, ధాన్యం కొనుగోలులో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరు వెంట ప్రత్యేక అధికారి జిల్లా ఆర్ డ బ్ల్యూ యస్ అధికారి రామస్వామి, తహశీల్దారు డి అశోక్ వర్మ ,ఎంపిడిఓ వి పూర్ణ బాబ్జీ, ఇన్చార్జి ఏఓ ఆడబాల  జ్యోషుల, రైతులు ,రెవిన్యూ ,ఆర్ బి కె సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.