ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం నగరంలో సబ్సీడీ వేరుశనగ ప్రాసెసింగ్ చేస్తున్న ప్లాంట్స్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మరియు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.చంద్రనాయక్ శనివారం తనిఖీ చేశారు. రైతులకు ఖరీఫ్ సాగుకు సబ్సీడీపై అందించే వేరుశనగ కాయలు నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ప్రాసెసింగ్ చేసి అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ ను మరియు ఏపీసీడ్స్ మేనేజర్ ధనలక్ష్మి ని ఆదేశించారు. విత్తన పంపిణీ నెల చివర్లో ఉంటుందని అంతలోపు ప్రాసెసింగ్ చేసిన విత్తనకాయలను మండలాలలోని రైతే భరోసా కేంద్రాల్లో నిల్వ చేసేవిదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.










