May 24,2023 15:33
  • జిల్లా కలెక్టర్ ప్రశాంతి

ప్రజాశక్తి -భీమవరం : పర్యావరణ హిత జీవన శైలిలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. బుధవారం స్థానిక అల్లూరి. సత్యనారాయణ సంస్కృతిక కేంద్రం వద్ద పర్యావరణ హిత జీవన శైలి మేరీ లైఫ్ లో భాగంగా  సైకిల్ ర్యాలీని  జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పర్యావరణ హిత జీవన శైలి మేరీ లైఫ్ లో భాగంగా నిన్న ప్లాస్టిక్ , క్యారీ బ్యాగుల వాడకుండా ప్రజలకు అవగాహన కల్పించటం జరిగిందన్నారు. ప్రభుత్వ ,ప్రవేటు కార్యాలయంలో  ప్లాస్టిక్, క్యారీ బ్యాగుల వాడకుండా చర్యలు తీసుకుని, క్లాత్,నార సంచులు తది తర వాటిని వాడే అలవాటు చేసుకోవాలన్నారు. కాలుష్యం రహితంగా ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయంలకు , తమ జీవన శైలిలో భాగంగా సైకిల్ మీద ప్రయాణాలు చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు యం. సూర్య తేజ, జిల్లా పంచాయతీ అధికారి జి వి కె మల్లిఖార్జునరావు, తహశీల్దారు యస్ యం ఫాజిల్, యం పి డి వో లు యన్ వి యస్ ప్రసాద్ యాదవ్, డా.ఆర్ సి ఆనంద్ కుమార్ , సి హెచ్ త్రిశూల ఫాణీ , తది తర అధికారులు, తది  పాల్గొన్నారు.