Mar 30,2023 15:56

ప్రజాశక్తి-ఉరవకొండ : వజ్రకరూరు మండలం కొనకొండ్ల  గ్రామం నందు తన స్వగృహములో ఎమ్మెల్సీ వై.శివ రామ రెడ్డి  ముఖ్యమంత్రి  సహాయనిధి నుండి మంజూరు కాబడిన చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఉరవకొండ మండలం షేక్షాన్ పల్లి  గ్రామానికి చెందిన మాదిగ రేణుకమ్మ అనారోగ్య బారినపడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆ చికిత్స నిమిత్తం వారు ఖర్చు చేసిన మొత్తము కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎమ్మెల్సీ వై.శివరామరెడ్డి ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితురాలకు 1,16,000/- రూపాయలు మంజూరు అయినది.ఆ యొక్క చెక్కును గురువారం ఎమ్మెల్సీ శివరామ రెడ్డి చేతులమీదుగా బాధితురాలకు అందజేశారు.ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు అనేక వ్యాధులకు ఉచిత వైద్యం అందించే సదుపాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని ఆరోగ్య శ్రీ కింద లేనటువంటి వ్యాధుల చికిత్స నిమిత్తం ఖర్చు చేసిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందజేయడం జరుగుతున్నదని అందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.పేదల ఆరోగ్యం నిమిత్తం ముఖ్యమంత్రి  చేస్తున్న ఆర్థిక సహాయానికి మరియు దీని కోసం కృషి చేసిన ఎమ్మెల్సీ శివరాం రెడ్డికి సదా రుణపడి ఉంటామని సంబంధిత కుటుంబ సభ్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల వైఎస్సార్సీపీ నాయకులు గుర్రం రామాంజనేయులు,గణేష్ తదితరులు పాల్గొన్నారు.