ప్రజాశక్తి-యాదమరి : అంటువ్యాధుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి యాదమరి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం ఫ్రైడే-డ్రై డే కార్యక్రమాన్ని ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చింతల గ్రామంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ దోమలు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. జూన్ మాసం నుండి డిసెంబర్ వరకు అత్యధికంగా జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని ఈ విషయమై ప్రజలకు వివరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలన్నారు. దోమల వ్యాప్తిని అరికడితే ప్రాణాంతకమైన డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా లాంటి జ్వరాల బారిన పడకుండా ఉంటామన్నారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా చూడాలని సిహెచ్ఓ లక్ష్మీనారాయణ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నిర్మలమ్మ, మహిళా ఆరోగ్య కార్యకర్త ప్రియ కుమారి, ఆశా కార్యకర్త రమాదేవి తదితరులు ఉన్నారు.










