Mar 22,2023 12:25
  • పండుగకు సైతం సెలవు ఇవ్వని వైనం....
  • సమాచారమిచ్చిన స్పందించని విద్యాశాఖ

ప్రజాశక్తి-హిందూపురం : కళాశాలలకు పేరు రావాలని... విద్యార్థులను చదువుల యంత్రాలుగా మారుస్తూ....  వారిని మానసికంగా వేధిస్తు... ప్రభుత్వ సెలవు దినాలే కాక... పండుగ పూట సైతం  సెలవివ్వకుండా కార్పొరేట్ కళాశాలలు తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ మాయాజాలంలో వారు ఇచ్చే ముడుపుల మత్తులో తూల తూగుతున్నారే తప్ప వారిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైన రన్నది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో నారాయణ కళాశాల బుధవారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన తరగతులను నిర్వహించడమే దీనికి నిదర్శనం. విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటి నుండి ఒక్క రోజు సైతం సెలవులు ఇవ్వని విద్యాసంస్థలు ఏవైనా ఉన్నాయా అంటే అది కార్పొరేట్ విద్యాసంస్థలే.  వారి స్వార్థం కోసం.. కళాశాలకు మంచి ఫలితాలు వస్తే ఫీజులను అధికంగా పెంచుకోవడంతో పాటు  అడ్మిషన్లు ఎక్కువ వస్తాయని ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులను చదువుల యంత్రాలుగా తయారు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారు. ప్రభుత్వం రెండవ శనివారం, ఆదివారంతో పాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో సైతం తరగతులను నిర్వహిస్తున్నారు. పని దినాల్లో సైతం ప్రభుత్వం నిర్ణయించిన సమయాలను పక్కనపెట్టి సమయపాలన పాటించకుండా తరగతులను నిర్వహిస్తున్నారు. దీనిని నిరసిస్తూ భారత విద్యార్థి సమైక్య (ఎస్ ఎఫ్ ఐ ) ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ఆందోళనలను నిర్వహించి విద్యార్థులను మానసికంగా వేధిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినప్పటికీ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల్లో కనీస చలనం కనిపించడం లేదు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఇచ్చే ముడుపుల మత్తులో ఉండడంతో అన్ని ఆధారాలతో పాటు అన్ని ఆధారాలతో తరగతులు నిర్వహిస్తున్నారని సమాచారం ఇచ్చినప్పటికీ వారిలో చలనం కనిపించడం లేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు విద్యార్థులను తమ పిల్లలుగా భావించి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువు పేరుతో మానసిక క్షోభను అనుభవిస్తున్న విద్యార్థులకు అండగా నిలచి, కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.