Oct 22,2022 15:24
  • సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్

 ప్రజాశక్తి-కుప్పం : కుప్పం ప్రాజెక్టులలో అంగన్వాడిలను వేదిస్తున్న అవినీతి ప్రాజెక్టు అధికారిణిపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. శనివారం కుప్పం మున్సిపల్ పార్కులో ప్రమీల అధ్యక్షతన అంగన్వాడీల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.  ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాదని దానిని త్రిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. మహా పడావ్ పేరుతో దేశవ్యాప్తంగా చేసిన పోరాటంతో కొంత కదలిక వచ్చిన ముందుకు పోలేదన్నారు. ఆర్థిక  మేధావులు ఐసిడిఎస్ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాలని సలహాలిస్తున్న దానిని పట్టించుకోకుండా ఐసిడిఎస్ను ప్రైవేటు వారికి అప్పగించాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తాసు పలుకుతూ నిర్లక్ష్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న అంగన్వాడీలపై దాడి చేయడం దారుణమన్నారు. ఈ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

  • వేధిస్తున్న అధికారపై చర్య తీసుకోవాలి

 కుప్పం ప్రాజెక్టు అధికారి ఉన్న సిడిపిఓ వచ్చినప్పటినుంచి నిరంతరం అంగన్వాడీలపై వేధింపులు నిర్వహిస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నదని దాని నిరసిస్తూ గతంలోనే ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన ఫలితంగా పిడి స్పందిస్తూ సిడిపిఓ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో కొన్ని రోజులు మానుకొని ప్రస్తుతం వేధింపులకు గురి చేస్తున్నదని ప్రతి చిన్న పనికి కమిషన్లు అడుగుతూ, ఇవ్వకపోతే వర్కర్ల మధ్య చిచ్చు పెట్టడం చేస్తున్నదని ఇలాంటి అవినీతి అధికారపై చర్యలు తీసుకోకపోతే బుధవారం నుండి నిరవధికంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

  •  నూతన కమిటీ ఎన్నిక 

 కుప్పం ప్రాజెక్ట్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షురాలుగా ప్రమీల కార్యదర్శి లలిత కోశాధికారిగా కస్తూరి ఉపాధ్యక్షులు శారదాలతో పాటు 21 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది