Apr 24,2023 16:39

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం నగరపాలక సంస్థ యందు పారిశుద్ధ్య విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న NMR, కోవిడ్, మలేరియా, మరియు గార్బేజ్ కార్మికుల వేతనములు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నందున వేతనములు సకాలంలో చెల్లించి, అదేవిధంగా కార్మికులందరికీ EPF, ESI, (deduction) అమలయ్యే విధంగా చూడాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని, డెత్ క్లైమ్ అమలు చేయాలని సోమవారం సిఐటియు అనుబంధ సంస్థ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హెల్త్ ఆఫీసర్ గంగాధర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు ఎర్రి స్వామి తిరుమలేశు, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మీనరసమ్మ( ట్రెజరర్), మంత్రి వరలక్ష్మి, సిఐటియు నగర మాజీ కార్యదర్శి ఎస్. లక్ష్మీనారాయణ, గురు రాజా, కమిటీ సభ్యులు శ్రీనివాస్ మూర్తి, బంగ్లా రాఘవేంద్ర ప్రసాద్, శేషేంద్ర కుమార్, నారాయణస్వామి, నబీ సాబ్ మరియు కోవిడ్, మలేరియా, గార్బేజ్ కార్మికులు పాల్గొనడం జరిగినది. ప్రతివారం స్పందనలో కార్మిక పారిశుధ్య కార్మికుల సమస్యలపై వినతి పత్రాలు అందజేస్తున్న వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్ట పోవటం శోచనీయమని అన్నారు నిర్ణీత గడువులోగా కార్మిక సమస్యలను పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవటం లేదన్నారు ఇప్పటికైనా  అధికార యంత్రాంగం స్పందించి కార్మిక సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని వారు కోరారు