May 22,2023 16:19

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : కార్మిక ఉద్యమ నిర్మాత పర్సా సత్యనారాయణ రాష్ట్రంలో అనేక కార్మిక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్ రాయ్ తెలిపారు. పర్సా సత్యనారాయణ వర్దంతి సభ సోమవారం స్థానిక సుందరయ్య భవనంలో గొన్నాబత్తుల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ, పర్సా సత్యనారాయణ రాష్ట్రంలో అనేక కార్మిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. సింగరేణి కార్మిక ఉద్యమ నాయకుడుగా పని చేశారని తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్యమం సందర్భంగా యంఎల్ సి పదవికి రాజీనామా చేశారన్నారు. కార్మిక ఉద్యమాలు సందర్భంగా జైలుకు వెళ్ళారని తెలిపారు.ప్రస్తుతం దేశంలోని పాలకులు కార్మిక చట్టాలను, హక్కులపై దాడి చేస్తున్నదని, వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సి.ఐ.టి.యు నాయకులు కర్రి నాగేశ్వరరావు, ధనాలు వెంకట్రావు,పి.వేణు గోపాల చౌదరి తదితరులు ప్రసంగించారు.