Jul 27,2023 14:08

ప్రజాశక్తి-ఆత్మకూరు : పంచాయితీ కార్మికులకు ఉద్యోగానికి భద్రత కల్పించాలని కోరుతూ గురువారం మండల పంచాయతీ కార్మికులు ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సిఐటియు రాష్ట్ర నాయకురాలు రమాదేవి ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము గ్రామపంచాయతీలలో ఎన్నో సంవత్సరాలుగా పంచాయతీలను నమ్ముకొని చాలీచాలని వేతనాలతో పనులు చేస్తున్నారని నిత్యం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, మురికి కాలువలను శుభ్రపరుస్తూ వీధి దీపాలు వేస్తూ నీటి సరఫరాతో పాటు కుక్కలు, పందులు ఇతర ఏ జీవాలు చనిపోయిన వాటిని తొలగిస్తూ మా ప్రాణాలను పణంగా పెట్టి పరిశుభ్రతకు పాటుపడుతున్న ప్రభుత్వం గానీ పాలకులు గానీ మమ్మలను మనుషులా గుర్తించడం లేదని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోగా నెలల తరబడి వేతనాలు పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే వారికి ఇవ్వాలని అలాగే ఉద్యోగానికి భద్రత లేదు ప్రాణాలకు రక్షణ లేదని ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు వారిపై దయ ఉంచి గ్రామపంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలని 11వ పిఆర్సి లో కనీస బేసిక్ వేతనం 20వేలకు తగ్గకుండా చెల్లించాలని స్వచ్ఛభారత్ కార్మికులను పంచాయతీ కార్మికులుగా గుర్తించి జీవో నెంబర్ 680 అమలుపరిచి వేతనాలు ఇవ్వాలని బాకాయి పడ్డ వేతనాలు పంచాయితీలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని పంచాయతీ కార్మికులపై రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ జయరాం నాయక్ కు వినతిరం అందజేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నంత అధికారులు దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు సిఐటియు మండల కార్యదర్శి జయమ్మ శివ శంకర్ అంగన్వాడి కార్యకర్తలు పంచాయతీ కార్యకర్తలు పాల్గొన్నారు.