ప్రజాశక్తి-చిత్తూరు : చిన్నప్పుడు బి.యన్నర్ పేట పాఠశాలలో చదువుకున్నన్న చదువు చాల ముఖ్యం.. చదువుతో పాటు కష్టపడేతత్వాన్ని అలవర్చుకోవాలి. ఒక లక్ష్యంతో బెంగుళూరులో బిల్డర్ గా పనిచేస్తూ కష్టపడ్డాను. ఈరోజు ఎమ్మెల్యే గా ఉన్నానంటే కష్టాన్ని నమ్ముకుని స్వయం కృషి ఎదిగానని విద్యార్థులకు గుర్తు చేశారు. విద్యతో పాటు క్రమ శిక్షణ ఉంటే ఎంతటివారినైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. చదువు ఎవరి ఆస్తి కాదు చదువుకు మించిన ఆస్తి లేదు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేవిధంగా చదువుకోవాలని భవిషత్తులో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వేము కళాశాల యాజమాన్యం మంచి విద్యను బోధిస్తు ఎంతోమంది విద్యార్థులను గొప్ప వాళ్ళు గా తీర్చిదిద్దుతున్నారని ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా అన్నిరకాల సదుపాయాలి కలిగిన వేము కళాశాలను యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేము కళాశాల కళాశాల చైర్మెన్ చంద్రశేఖర్ నాయుడు , తసీల్దారు విజయ భాస్కర్, ఎంపిడిఓ గౌరి, ఎస్సై మనోహర్, వైసిపి నాయకులు రాజరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










