Jun 12,2023 16:49

ప్రజాశక్తి-యలమంచిలి : మండలంలోని చించినాడ గ్రామానికి చెందిన ఉద్యమ నాయకురాలు విప్పర్తి లక్ష్మమ్మ 94 సోమవారం మృతి చెందారు, ఆమెకు ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమారులు ఉన్నారు. లక్ష్మమ్మ మృతి వార్త తెలియగానే సిపిఎం సీనియర్ నాయకులు కేత సూర్యరావు సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజులు లక్ష్మమ్మ భౌతికాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ.. 1977 _1980 మధ్యకాలంలో గ్రామంలో భూస్వాములకు పేదలకు మధ్య జరిగిన పోరాటంలో లక్ష్మమ్మ తన భర్త పెద వెంకన్నతో కలసి భూస్వామ్యులతో వీరోచితంగా పోరాడి ఎందరికో ఆదర్శంగా నిలిచారని అటువంటి పోరాట యోధురాలు మృతి తీవ్ర దిగ్భ్రాంతి నీ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం లక్ష్మమ్మ భౌతికకాయంపై ఎర్రజెండాను కప్పి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గొల్ల ఏడుకొండల శ్రీనివాస్ చెల్లు బోయిన వడ్డీకాసులు, తెన్నేటి స్టాలిన్, శెట్టి మి భాస్కరరావు, ముమ్మిడివరపు ఆంజనేయులు, పల్లేరు వెంకటస్వామి, ముస్కుడి రాజు, మురాల జై సింగ్, మురాలా రాజేష్,, కేత వాసు తదితరులు పాల్గొన్నారు.

  • పలువురు సంతాపం 

విప్పర్తి లక్ష్మమ్మ మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు సత్యనారాయణ రాజు ( ఆర్ఎస్) సిపిఎం జిల్లా  కార్యదర్శి బి బలరాం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు, జె ఎన్ వి గోపా లన్, సిపిఎం జిల్లా నాయకులు జక్కం శెట్టి సత్యనారాయణ, బాతిరెడ్డి జార్జి, ఐద్వా జిల్లా కార్యదర్శి  పొగాకు పూర్ణ మండల అధ్యక్ష కార్యదర్శులు బాతిరెడ్డి సుగుణ, జిల్లెల్ల ప్రశాంతిలు తీవ్ర సంతాప సానుభూతిని తెలిపారు,