May 18,2023 12:30
  •  పట్టించుకోని అధికారులు - చర్యలు శూన్యం  

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలను జనవరి 2023 నుండి నేటి వరకు 20 దాకా బాల్యవాలు జరిగాయి అధికారులకు 100కు స్థానికులు సమాచారం ఇచ్చిన పిల్లల తల్లిదండ్రులను పోలీసులు రెవెన్యూ అధికారులు ఐసిడిఎస్ అధికారులు సచివాలయం సిబ్బంది వివాహాలు చేయరాదు. బాల్యవాహల నుండి పిల్లలకు అనారోగ్య కారణాలు వస్తాయని చెప్పి పంపియడం జరుగుతోంది. అనంతరం తల్లిదండ్రులు గుడిలోనూ  వివాహాలు చేసుకుని యధావిధిగా కాపురాలు చేసుకుంటూ జీవనం కనిపిస్తున్నారు చిన్న వయసులో పిల్లలు కావడం భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం వాటిని భరించలేక విడిపోవడం రెండో వివాహానికి ప్రయత్నాలు చేయడం. ఇది జిల్లా కేంద్రకి దగ్గర్లో ఉన్న మండలం ఆత్మకూరు ఏ ఒక్క బాలవిహాని గాని అధికారులు దగ్గరుండి ఆపడం చట్టపరంగా నేరమని అలా వివాహాలు చేస్తే మీపై కేసులు నమోదు చేస్తామని దాఖలాలే లేవు. పోలీసులు రెవిన్యూ అధికారులు అరికట్టాల్సిన అధికారులు గ్రామాల్లో లేకపోవడం ఇది కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఎన్ని చట్టాలు చేసినా వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో బాల వివాహనికి దారితీస్తుందని స్థానికులు చెబుతున్నారు. గత రెండు మూడు రోజుల నుండి చిన్నచిన్న దేవాలయల వద్దకు వెళ్లి వివాహాలు చేసుకుంటున్నట్లు తెలిసినా కూడా అధికారులు పట్టించుకున్న పాపాన లేదు ఇప్పటికైనా ఉన్నంత అధికారుల స్పందించి బాల్యవివాహాలను అరికట్టాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు.