ప్రజాశక్తి - పెనుమంట్ర : జగన్ పాలనను శ్రీలంకతో పోల్చి మాజీ ముఖ్యమంత్రి అదే నోటితో జగన్ అందిస్తున్న పథకాలను తాను మార్పు చేయనని చంద్రబాబు మభ్యపెడుతున్నాడని ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఘాటుగా విమర్శించారు. గురువారం మార్టేరు రెడ్డి కళ్యాణమండపంలో , ఆలమూరు, ఎంపీడీవో కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలకు మూడో విడత ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణలను ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా రంగనాథరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో వేల మంది మహిళలకు ఆసరా అందిస్తూ, 14 వేలమంది లబ్ధిదారులకు నియోజకవర్గంలో నిలపట్టాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇన్ని పథకాలు చేస్తున్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరిగా కరువు కాటకాలతో రాబోయే కాలంలో మారిపోతుందని విమర్శించిన నోటితోనే వచ్చే ఎన్నికల్లో తన ప్రభుత్వం వచ్చిన ప్రస్తుత ప్రభుత్వ పథకాలను అమలు చేస్తాం హామీ ఇవ్వడం సిగ్గుగా లేదా అని విమర్శించారు. అంతేకాదు స్థానిక మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కొడుకు కరోనా సమయంలో స్కాం చేస్తే అతనిని అరెస్టు చేయమని తామెప్పుడు డిమాండ్ చేయలేదని తప్పు చేస్తే ఎటువంటి వ్యక్తి అయినా న్యాయస్థానానికి జవాబు చెప్పాల్సిందే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవకపోతే డ్వాక్రా మహిళల యొక్క ఉసురు తమకు తగులుతుందని అందువల్ల ప్రతి ఎమ్మెల్యే ఆ స్థితి కల్పించుకోవద్దని ముఖ్యమంత్రి ప్రతి ఎమ్మెల్యేకి సలహా ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మరోసారి గడపగడపకు కార్యక్రమమున ప్రారంభిస్తానని అన్నారు. అనంతరం మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్టకుమారి, ఎంపీపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు రెడ్డి), ఏఎంసీ చైర్మన్ వెలగల వెంకటరమణ ( మిస్సమ్మ), వెలగలేరు , నెగ్గిపూడి సర్పంచులు కొవ్వూరి మధువాణి, మామిడి శెట్టి ధనలక్ష్మి, వెలగలేరు, నెగ్గిపూడి ఎంపిటిసిలు కర్రిలక్ష్మి, పెనుగొండ లక్ష్మిలు, ఆలమూరు సర్పంచ్ మేడపిరెడ్డి వెంకటరమణ, పెనుమంట్ర సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక, ఐకెపి ఇంచార్జ్ ఏపీఎం రామకృష్ణ, యానిమేటర్లు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.










