Oct 29,2022 16:38
  • ప్రధానోపాధ్యాయులు నాగమల్లిక

ప్రజాశక్తి-చౌడేపల్లె : జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు-2022 పరీక్ష శనివారం మేకల చిన్నేపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగమల్లికా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మూఢనమ్మకాలు మానవ మనుగడకు అవరోధకాలని మూఢనమ్మకాలు నమ్మకూడదని, శాస్త్రవిజ్ఞానం ఎంతో పురోగతి చెందిన ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ మూఢనమ్మకాలు ఉండడం శోచనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమందిలో ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయని వీటిని తొలగించుటకు విద్యార్థులు తమవంతు బాధ్యతగా మూడ నమ్మకాలు కలిగిన ప్రజలకు ఇవి తప్పని తెలియజేసి వారిలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలి. ఈ చెకుముకి పరీక్షలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులు మండల స్థాయిలో నిర్వహించే పరీక్షకు ఎంపిక చేయబడుతుందని తెలియజేయడమైంది. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు లింగమూర్తి, బీసాబత్తిని పురుషోత్తం ఉపాధ్యాయులు దామోదరం, గోవిందు, వీరభద్రయ్య, చంద్రశేఖర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.