Nov 10,2022 15:02

ప్రజాశక్తి-చిత్తూరు : జిల్లా బంగారుపాళ్యం అర్బన్ పోలీస్ స్టేషన్ ను చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, IPS అకస్మిక తనికీ చేశారు. బంగారుపాళ్యం అర్బన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సమీక్షించారు. 

  • మహిళా పోలీసులు, వలంటీర్లను వినియోగించి గ్రామాల్లోని ఇంటింటికి పంపి మహిళా నేరాలు జరిగే వీలున్న సమాచారం సేకరించడం, ఫోక్సో, ఛీటింగ్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
  • గ్రామ సచివాలయాల మహిళా పోలీసులు ఇచ్చిన నివేదికపై రిజిష్టర్ మెయింటేన్ చేయాలి. తరుచూ సమీక్షిస్తూ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని తీవ్ర నేరాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సర్కిల్ పరిధిలో తీసుకున్న చర్యలను సమీక్షించారు. బ్లాక్ స్పాట్స్ సందర్శించి రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
  • పెట్రోలు బంకులు, గన్ లైసెన్సులను సమీక్షించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు మరింత చేరువ కావాలి.
  • ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది పోలీసులు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సహాయం చేయాలి.
  •  హత్యలు, హత్యాయత్నాలు, తదితర తీవ్ర బాడిలీ అఫెన్సెస్ జరుగక ముందే మొగ్గ దశలోనే తుంచేయాలి. గ్రామ సచివాలయాల మహిళా పోలీసులను సమన్వయం చేసుకుని ఇంటింటా సర్వే చేయించి సమాచారం సేకరించాలి. 
  • ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు.
  • రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి. డ్రంకన్ డ్రైవ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి.
  • ఈ కార్యక్రమంలో పలమనేర్ డీఎస్పీ  ఎన్.సుధాకర్ రెడ్డి, ఎస్.బి. డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, DCRB ఇన్స్పెక్టర్  శరత్ చంద్ర ఈ తనిఖీలో పాల్గొన్నారు.