ప్రజాశక్తి-కాళ్ల : కాళ్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పశ్చిమగోదావరి జిల్లా ప్రజారోగ్య నర్సింగ్ అధికారిని జి వెంకటరత్నం సోమవారం తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో మాట్లాడారు. ఎంసిడి కార్డులను తనిఖీ చేశారు.ప్రజలకు మరింత సేవలు అందించాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పథకాల గురించి అందుతున్నాయా లేదా అనేది గర్భిణీ స్త్రీలను అడిగి తెలుసుకున్నారు. స్త్రీలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. పౌష్టికాహారం గురించి, సాధారణ కాన్పు వల్ల కలిగే ప్రయోజనాలను, కుటుంబ నియంత్రణలో భాగం తాత్కాలిక పద్ధతులు, స్క్రీనింగ్ టెస్టుల నుంచి వివరించారు. పిహెచ్ సిలో ఆమె పలు రికార్డులు తనిఖీ చేశారు. ఆశ కార్యకర్తలకు సంబంధించిన సెల్ ఫోన్లు కొన్ని సరిగా పనిచేయడం లేదు. అటువంటి సెల్ ఫోన్ లను మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది పనితీరు గురించి ప్రజలకు అందుతున్న సేవలు గూర్చి తెలుసుకొని వైద్య ఆరోగ్య సిబ్బందిని మరింత సేవలు అందించాలని ఆదేశించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. దాత ఆర్థిక సహకారంతో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజారోగ్య నర్సింగ్ అధికారిని జి వెంకటరత్నం మాట్లాడుతూ ఆరోగ్య సేవల నిర్వహణ యొక్క ప్రతి స్థాయిలో ఆరోగ్య బృందంలోని ఇతర సభ్యులతో వారి పరస్పర చర్యతో సహా ఆరోగ్య సంరక్షణ డెలివరీ వ్యవస్థలో నర్సింగ్ సిబ్బంది పాత్రను కీలకంగా వ్యవహరించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా దిగువ స్థాయిలలో నర్సింగ్ సేవల సంస్థ యొక్క ఆవశ్యకతను పరిశీలించారు. పిహెచ్ సిలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థతో సమగ్ర నర్సింగ్ కేర్ సేవలను ప్రణాళిక, అమలు చేయవలసిన అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం గులాబ్ రాజ్ కుమార్, సి హెచ్ ఓ డి.విజయవతి, పీహెచ్ఎన్ డి.చండీ రాణి, డీసీఎం జి.బాల, హెచ్ వి పి.పరంజ్యోతి, ఏఎన్ఎం లు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్య కర్తలు, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.










