Jul 08,2023 16:02

ప్రజాశక్తి-కాళ్ల : కాళ్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పశ్చిమగోదావరి జిల్లా అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ బి భాను నాయక్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పీహెచ్ సి లో కంటి వెలుగు, ఫ్రైడే డ్రైడే, ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం పని తీరును అడిగి తెలుసుకున్నారు. పెదఅమిరం గ్రామంలో 1,2 విలేజ్ హెల్త్ క్లినిక్ లను పరిశీలించారు. ఎంతమందికి సేవలందిస్తున్నారు, ఏ విధంగా సేవలందిస్తే హెల్త్ క్లినికల్ లో మందుల లభ్యత, పరీక్షల పనితీరుఅడిగితెలుసుకున్నారు. ఇమ్యునైజేషన్ ని బాగా మెరుగుపరచాలని ఆయన సూచనలిచ్చారు. వైద్య ఆరోగ్య సిబ్బంది పనితీరు గురించి ప్రజలకు అందుతున్న సేవలు గూర్చి తెలుసుకొని వైద్య ఆరోగ్య సిబ్బందిని మరింత సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం కాళ్ల పంచాయితీలో ఫ్రైడే -డ్రైడే  కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి  పరిశీలన చేశారు. ఎక్కడ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. నీరు నిల్వ ఉండే పనికిరాని టైర్లు, కొబ్బరి బొండాలు, పూల కుండీలు ఇటువంటి వాటిలో నీరు నిల్వ లేకుండా చూడాలని సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి కే శ్రీనివాసరావు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ కే భాస్కర రావు, ఆరోగ్య విస్తరణాధికారి హరి వెంకటేశ్వర్లు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.