ప్రజాశక్తి - కాళ్ళ : ఉత్తమ ఆశయాలతో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఉన్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కాళ్ల లో చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించారు. కాళ్ల మండల కేంద్రంలో టిడిపి నేతలు ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే చంద్రబాబు బర్తడే కేకు కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు గుండా బత్తుల వెంకట నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు వేణుగోపాలరావు, మాజీ ఎంపీపీ వెంకటరత్న ప్రసాద్, మాజీ ఎంపిటిసి బొత్స గణేష్, టిడిపి నాయకులు తోట పణిబాబు, కొప్పినీడి గణపతి, మంతెన నాగంజనేయులు, గుర్రం వెంకట సత్యనారాయణ, యలమంచిలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.










