- రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం
ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో సిఐటియుకౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జీపు జాత ఆత్మకూరు మండలం రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పైన కార్మిక వ్యవసాయ రైతులు ప్రజా సమస్యలు మరింతగా పెంచింది మన సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ కార్పొరేట్లకు దోచిపెట్టడం అంబానీ ఆదానీ అటువంటివారు సేవలో మునిగి తేలుతుంది. దేశ రాజ్యాంగం ప్రసాదించిన కనీస ప్రజాస్వామిక హక్కులను కాల రాస్తుంది. తన ప్రజా వ్యతిరేక విధానాలకు ఎదురు తిరుగుకుండా చూసుకోవడానికి మతం పేరుతో ప్రజలు రెచ్చగొట్టి పరిపాలిస్తున్నది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక రైతు ప్రజా వ్యతిరేకంగా ప్రైవేట్ కార్పొరేట్లు పెట్టుబడి దారులకు దేశ సంపదను దోసి పెట్టే విధంగా ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలను మోడీ పాలనకు వ్యతిరేకంగా అనుకూల విధానాల సాధన కోసం ఏప్రిల్ 5 తేదీ నాడు చలో ఢిల్లీలో ఆత్మకూర్ మండల ప్రజలు రైతులు కూలీలు కార్మికులు చలో ఢిల్లీ జయప్రదం చేయండి. శివ శంకర రామయ్య రాజేశ్వరమ్మ వెంకటమ్మ సోమశేఖర్ సరస్వతి వల్లి తదితరులు పాల్గొన్నారు










