Mar 25,2023 15:05

ప్రజాశక్తి-గణపవరం : బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జిల్లా ప్రజానీకం జయప్రదం చేయాలని కోరుతూ శనివారం పిప్పరలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గోడ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమం లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఢిల్లీలో రైతులకు ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు గణపవరం మండల కార్యదర్శి గుత్తుల శ్రీను సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్.మండల.అద్యక్షలు. పి.గోవిందు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కే సోమరాజు కౌరు పెద్దిరాజు బాలిరెడ్డి జార్జి బి వీరభద్రరావు, జే వెంకటలక్ష్మి, ఎడ్ల చిట్టిబాబు, కౌలరైతు సంఘం నాయకులు మామిడి శెట్టిరామాంజనేయులు, పెచ్చేట్టి నరశింహమూర్తి పాల్గొన్నారు.