ప్రజాశక్తి-భీమవరం : విద్యారంగం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి యుటిఎఫ్ ఉపాధ్యాయులు బుధవారం తరలివెళ్లినట్లు సంఘం రాష్ట్ర కోశాధికారి బి గోపిమూర్తి అన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి జిల్లా యుటిఎఫ్ నేతలు బుధవారం తరలి వెళ్లారు. సందర్భంగా గోపి మూర్తి మాట్లాడుతూ సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్దీకరణ చేయాలని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టాన్ని 12వ తరగతి వరకు విస్తరింప చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు.రూ.7.50లక్షలు ఆదాయం వరకు ఇన్కమ్ టాక్స్ మినహాయింపు ఇవ్వాలని,రూ.2.5లక్షలు వరకు స్టాండర్డ్ డిటెక్షన్ ఉండాలని, 80సీసీ మినహాయింపు రూ. 3 లక్షల వరకు ఉండాలని డిమాండ్ చేశారు. చలో ఢిల్లీ తరలి వెళ్లిన వారిలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, ఇతర జిల్లా నేతలు ఉన్నారు










