తాడేపల్లిగూడెం:ఛారిటీ బాక్సు ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలో వెంకటరామ థియేటర్ దగ్గర పరదాల్లో నివాసం ఉంటున్న సంచార జీవులకు బుధవారం నిత్యావసరాలు అందజేశారు. ఈ ప్రాంతంలోని ఇరవై కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఛారిటీ బాక్సు ప్రతినిధి కోదాటి వెంకటరావు మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణమే ఛారిటీ లక్ష్యమన్నారు. ఒక్కో పేద కుటుంబానికి కందిపప్పు, గోధుమ పిండి, పంచదార, ఉప్మానూక, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు అందజేశారు. దయాగుణం, సేవాభావమే ఛారిటీ బాక్సును ముందుకు నడిపిస్తోందన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సేవా కార్యక్రమాలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ రొక్కాల నాగబుజ్జీ, రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ కర్నాటి కన్నయ్య మాట్లాడారు.










