Oct 28,2022 16:14

ప్రజాశక్తి-యాదమరి : సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, నిర్ణయిత వేళలో విధులకు హాజరై, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా  పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి సిబ్బందిని అదేశించారు. శుక్రవారం యాదమరి మండలములోని పెరియాంబాడి నందు డంపింగ్ యార్డ్ ను, గ్రామ సచివాలయము, వెల్ నెస్ సెంటర్ & కోణాపల్లి, గ్రామ సచివాలయములను ఆకస్మికంగా  తనిఖీ చేసినారు. పెరియాంబాడి, కోణాపల్లి ఎస్ డబ్ల్యూ పిసి సెంటర్ లను సందర్శించి, ప్రజల నుండి సేకరించిన తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా పెట్టి ఎరువును తయారు చేయు విధమును పరిశీలించారు. డంపింగ్ యార్డ్ దగ్గర దగ్గర పచ్చదనం ,పరిశుభ్రతను పాటించాలని  క్లాప్ మిత్రాలకు, గ్రీన్ అంబాసిడర్లకు తెలియజేసినారు. పెరియాంబాడి నందు నిర్మాణంలో వున్న వెల్ నెస్ సెంటర్ భవన నిర్మాణ పనులను పరిశీలించి, భవన నిర్మాణ  పనులను త్వరితగతిన పూర్తి చేసి భవనమును అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించినారు. పెరియాంబాడి ,కోణాపల్లి గ్రామ సచివాలయములందు అభివృద్ధి పథకాలు, లబ్ధిదారుల జాబితాను డిస్ప్లే బోర్డు నందు పరిశీలించిన పిదప పలు రిజిస్టర్లు రికార్డులు (సిబ్బంది హాజరు పట్టిక, సెలవుల రిజిస్టర్, స్పందన గ్రీవెన్స్ రిజిస్టర్ )ను తనిఖీ చేసి ,అభివృద్ది పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అందుబాటులో వున్న గ్రామ సచివాలయ  సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ  సంధర్బంగా జడ్పీ సీఈఓ మాట్లాడుతో  "సిబ్బంది అందరు నిర్ణీత వేళలో విధులకు హాజరై, పనులను సకాలములో పూర్తి చేసి, ప్రజలకు జవాబుదారిగా ఉండాలని " చెప్పినారు. జడ్పీ సీఈఓ తో పాటు యాదమరి ఎంపిడిఓ శ్రీ .ఓ .శివరాజ్ , డిపిఆర్  సి కో ఆర్డినేటర్ శ్రీ షణ్ముగ రామ్, పెరియంబడి గ్రామ సర్పంచ్ కృష్ణవేణి కరుణాక