ప్రజాశక్తి-ఉరవకొండ : ఉరవకొండ మండలంలోని నెరిమెట్ల గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టినట్లు యోగేంద్ర రెడ్డి తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామానికి ఈ ఏడాది సీసీ రోడ్లు నిర్మించడానికి ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసిందని, ఆ నిధులతో సర్పంచ్ యోగేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా రోడ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. శుక్రవారం రోడ్ల నిర్మాణం పనులను పంచాయతీ కార్యదర్శి మహేష్ తో కలిసి సర్పంచ్ పరిశీలించారు.పనులు నాణ్యతతో చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ సందర్భంగా యోగేంద్రరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న నిధులతో గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.










