ప్రజాశక్తి - మొగల్తూరు
మండలంలోని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జగన్నాథపురం, కోమటితిప్ప, వారతిప్ప, కొత్తోట, కాశీపట్నం తూర్పు, కెపిపాలెం నార్త్, పేరుపాలెం నార్త్, సౌత్ గ్రామాల్లోని పంట బోదె తవ్వకం పనులు చేపట్టారు. బుధవారం జగన్నాథపురంలో చేపట్టిన తవ్వకం పనులను మస్తరు ఎపిఒ వై.శ్రీనివాస్ పరిశీలించారు.










