Apr 28,2023 22:00

నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, రాయలసీమ విమోచన సమితి నాయకులు

           ప్రజాశక్తి-గుత్తి   రైతులు సంబంధించిన చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు పలుదురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ విమోచన సమితి కన్వీనర్‌ వై.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చుక్కల భూములను రైతులకు భూముల రిజిస్ట్రేషన్‌ చేయాలని ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. దీంతో జిల్లాలో చాలామంది రైతులు చుక్కల భూములు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే చుక్కల భూములను రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విమోచన సమితి నాయకులు జ్ఞానేశ్వర్‌ రెడ్డి, కాశీరావు, సూర్యనారాయణ, శివయ్య, రంగనాయకులు, తదితరులు పాల్గొన్నారు.