Apr 20,2023 10:05

ప్రజాశక్తి-రొద్దం : మండలంలో పేకాట జూదంపై పోలీసులు దాడి చేశారు. పెనుకొండ ఎస్ డిపిఓ పర్యవేక్షణలో, పెనుకొండ సిఐ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9.00 గంటల సమయంలో రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ నాగస్వామి తన సిబ్బంది సహాయంతో మండలంలోని సానిపల్లి గ్రామ సమీపంలో గల కంప చెట్ల వద్ద పేకాట ఆడుతున్న పేకాట స్థావరంపై దాడి చేసి, పేకాట ఆడిస్తున్న పేకాట ఆర్గనైజర్స్ పెనుకొండ మండలం మావటూరు గ్రామానికి చెందిన రవి, నాగప్పలతో పాటు మొత్తం 13మంది పేకట రాయుళ్ళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.14,860/- నగదు మరియు 5 మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ నాగస్వామి తెలపారు.