Mar 24,2022 22:45

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పి వెంకటఅప్పలనాయుడు


ప్రజాశక్తి-తిరుపతి సిటి
స్థానిక అర్బన్‌ పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు నెలలో, ఈ నెల 13వ తేదిన తిరుపతి ఇర్లా నగర్‌లో జరిగిన రెండు చోరీ కేసుల్లో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడు అదే ప్రాంతానికి చెందిన బల్లాపురం రాజేష్‌గా పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ నెల 13వ తేదిన గాయత్రి ఎంటర్‌ప్రైజెస్‌ కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనానికి సాయంత్రం ఆరు గంటలకు వెళ్లి, తిరిగి రాత్రి 10 గంటలకు వచ్చే సరికి నిందితుడు వారి ఇంటిలో రహస్యంగా చొరబడి చోరీకి పాల్పడ్డారన్నారు. ఈ చోరీలో 1610గ్రాముల బంగారం, 13కేజీల వెండి నగలతోపాటు 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారని, ఇతనిపై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు అరెస్టు, సొత్తు స్వాదీనానికి సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. వారికి రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్‌పి సుప్రజ, డిఎస్‌పి నరసప్ప పాల్గొన్నారు.