ప్రజాశక్తి-వీకోట : వి కోట మండలంలోని గత నాలుగు రోజుల నుంచి గంజాయి సరఫరా చేస్తున్న వారిపై వీకోట సిఐ ఆశీర్వాదం ఉక్కుపాదం మోపారు. గత నాలుగు రోజుల నుంచి నాలుగు కేసులు సీఐ నమోదు చేశారు. శనివారం సాయంత్రం ప్యార్నంబట్ రోడ్డు రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా తమిళనాడుకు చెందిన ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించారు. నాకినేరి సరిహద్దు ప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసి గంజాయి సరఫరా చేస్తున్నామని అంగీకరించినట్లు తెలిపారు. చింతమకులపల్లి పంచాయతీ కుదవగడ్డకు చెందిన సుబ్రహ్మణ్యం(32), తమిళనాడు రాష్ట్రం చెందిన ఆసిఫ్ రహ్మాన్ (22), ఇమ్రాన్ అహ్మద్(22), కైసర్ హుస్సేన్ ,(21), లను అరెస్టు చేసి వారి వద్ద సుమారు 5 కిలో గంజాయి రెండు దీవచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి మొత్తం విలువ సుమారు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు గా అంచనా వేశారు. గత నాలుగు రోజుల నుంచి ఇప్పటివరకు 16 కేజీల గంజాయి పట్టుకున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆశీర్వాదం, ఎస్సై మనోహర్ తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఎస్సై మనోహర్, ఏఎస్ ఇ జైకృష్ణ, ఇతర పోలీసు సిబ్బందినీ అభినందించారు










