Oct 14,2023 20:41

మాట్లాడుతున్న డాక్టర్‌ జడ్‌ శివ ప్రసాద్‌

మాట్లాడుతున్న డాక్టర్‌ జడ్‌ శివ ప్రసాద్‌
చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:గత 36 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు మూడు రోజుల నుండి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వారికి మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర టిడిపి వైద్య విభాగ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరముల నుంచి చంద్రబాబు నాయుడు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారన్నారు. దానికి ఆయన వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో మందులు ఆహారం వ్యాయామంతో ఆరోగ్యాన్ని నిలకడగా కాపాడుకుంటూ వస్తున్నారన్నారు.
అరెస్టు తర్వాత జైల్లో వాతావరణ మార్పులు జరగడంతో పాటు కలుషితమైన నీరు, దోమల బెడద, బాడీ డిహైడ్రేషన్‌ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తేయని ఆయన అన్నారు. సమావేశంలో పట్టణ టిడిపి అధ్యక్షులు మామిడాల మధు, పదవ డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ తిరుమల నాయుడు, భువనేశ్వర్‌ ప్రసాద,్‌ ప్రశాంత్‌, అంబ్రెల్లా పాల్గొన్నారు