చంద్రబాబుకు మద్దతుగా టిడిపి నేతలు నిరసన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా సోమవారం గాంధీ జయంతి సందర్భంగా తహశీల్దార్ కార్యాలయం వద్ద టిడిపి శ్రేణులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎపి అభివృద్ధి పథంలో నడిపించి మహా నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. అటువంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జగన్‌మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుందని చంద్రబాబు నాయుడు నిరపరాధిగా విడుదలవుతారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజ రెడ్డి, పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, రూరల్ మండల అధ్యక్ష కార్యదర్శులు సుంకర పెంచలయ్య చౌదరి, కేత విజయ భాస్కర్ రెడ్డి, చంద్ర వెంకటసుబ్బా నాయుడు, కౌన్సిలర్లు గౌస్ బాషా, మాదాల శ్రీనివాసులు నాయుడు, పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, మద్దినేని నారాయణ, మీరా మొహిద్దీన్, తోడేటి వెంకటయ్య, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.










