Apr 21,2023 08:35

అనంతపురంలో కేక్‌కట్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి

       అనంతపురం కలెక్టరేట్‌ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అనంతపురం అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అర్బన్‌ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి హాజరై కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దూర దృష్టితో తెలుగు రాష్ట్రాల అభివద్ధికి కషి చేశారని కొనియాడారు. టిడిపి జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు యువత నాయకులు బంగినాగ ఆధ్వర్యంలో సాయిబాబా గుడిలో, పాలాభిషేకం, 73 టెంకాయలు కొట్టి, కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు దేవర్లమురళి, నగర అధ్యక్షుడు మారుతికుమార్‌ గౌడ్‌, జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, నారాయణస్వామియాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షులు డిష్‌.నాగరాజు, నగర మహిళా అధ్యక్షురాలు విజయశ్రీరెడ్డి, రాష్ట్ర నాయకురాలు తేజశ్విని, బంగినాగ, తెలుగుయువత సుధాకర్‌ యాదవ్‌, కూచిహరి తదితరులు పాల్గొన్నారు.