ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
భవిష్యత్తుకు భరోసా ఇస్తూ మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలను గ్రామస్థాయి వరకూ ఏ విధంగా తీసుకెళ్లాలి అనే అంశంపై విస్తృత స్థాయి సమావేశం గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల బాబ్జి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మ్యానిఫెస్టో హర్షదాయకంగా ఉందనన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని గద్దె దింపడం ఖాయమన్నారు. 2024 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం సీటు టిడిపిదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ విభాగాల్లో నియమితులైన సభ్యులందరూ గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి టిడిపి గెలుపునకు కృషిచేయాలని కోరారు. సమావేశంలో గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, ముత్యాల సత్యనారాయణ, వాడపల్లి సుబ్బరాజు పాల్గొన్నారు










