ప్రజాశక్తి-అనంతపురం గత టిడిపి హయాంలో చంద్రబాబు దోచుకుని దాచుకుంటే.. వైఎస్ జగన్ సిఎం అయ్యాక వివిధ సంక్షేమ పథకాల పేర పంచిపెడుతున్నాడని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు వైసిపి ప్రభుత్వం వల్ల కల్గిన లబ్ధిని వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశారు... ఏ ప్రభుత్వంలోనైనా నేరుగా సంక్షేమ పథకాల డబ్బులు ఖాతాల్లో పడ్డాయా.. ఏ ముఖ్యమంత్రి మంచి పనులు చేశారో ప్రజలు గమణించాలి' అని కోరారు. నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.1లక్ష నుంచి రూ.3లక్షల వరకూ నేరుగా ఖాతాల్లో జమైందన్నారు. పేదల గుండె చప్పుడు సిఎం జగన్ అన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిధ పథకాల ద్వారా నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు సంపదను దోచుకుంటే జగనన్న మాత్రం ప్రజలకు సంపదను పంచి పెడుతున్నాడని గుర్తు చేశారు. ఇంత మేలు చేసిన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడైనా చూశారా..? అని ప్రశ్నించారు. అలాంటి ముఖ్యమంత్రి జగన్‌ను మరోసారి ఆశీర్వదించానలి కోరారు. అనంతరం కందుకూరులో పూర్తయిన సచివాలయం 1, 2 భవనాలతోపాటు రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ కేంద్రం భవనాలను ప్రారభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచు ప్రశాంత్‌కుమార్, మండల కన్వీనర్ గోవిందరెడ్డి, నాయకులు లింగమయ్య, నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మహిళకు కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, తదితరులు










