చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు
ప్రజాశక్తి-కావలి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలియజేశారు. కావలి నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. బాబు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసి కూడా జైలు అధికారులు వైద్యాధికారులకు సమాచారం ఇవ్వకుండా నిరంకుశ విధానాలు అవలంభించడాన్ని ఖండిస్తున్నామన్నారు. వైద్యాధికారులు విడుదల చేయాల్సిన హెల్త్ బులిటెన్‌ను జైలు సూపరింటెండెంట్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. బాబుపై నిర్లక్ష్యం వహిస్తే టిడిపి కార్యకర్తలు ఊరుకోరని జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించేంతవరకు నిద్రపోరని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మొగిలి కల్లయ్య, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఏగూరి చంద్రశేఖర్, జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు బొట్లగుంట శ్రీహరి నాయుడు, నియోజకవర్గ లీగల్‌సెల్ అధికార ప్రతినిధి గొట్టిపాటి మనోరమ, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు కోట రమేష్, రూరల్ మండలం రైతు విభాగం అధ్యక్షులు పులి సుధాకర్, వార్డ్ ఇన్‌ఛార్జులు శానం హరి, మంచాల ప్రసాద్, ముఖ్య నాయకులు పులిమి భాస్కర్ రెడ్డి, పేరం రవిబాబు, పెనుగొండయ్య, తదితరులు పాల్గొన్నారు.










