ప్రజాశక్తి-గుమ్మఘట్ట వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ఎన్ని వేషాలు వేసినా, హామీలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని ఆర్.కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాపు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు బుక్‌లెట్(పుస్తకాలు)లను లబ్ధిదారులకు అందజేశారు. టిడిపి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను మంజూరు చేసేందుకు జన్మభూమి కమిటీ సభ్యులు రేట్లను ఫిక్స్ చేసి ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేశారని, వైసిపి పాలనలో అర్హులందరికీ నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. సిఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టిడిపి నాయకులు, ఎల్లో మీడియా విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈఓఆర్‌డి సురేష్‌బాబు, డిప్యూటీ తహశీల్డార్ రఘు, జడ్పిటిసి మహేష్, ఎంసిసి భవాని, వైస్ ఎంపిపి రామకృష్ణారెడ్డి, సర్పంచి ఉమేష్, కెపి దొడ్డి సర్పంచి రమేష్, నాయకులు ఆర్‌టి కాంతారెడ్డి, కాంట్రాక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బిటిపి గోవిందు, ఎంపిటిసి గోవిందు, బేలోడు రామాంజనేయులు, గుమ్మఘట్ట రాజు, సచివాలయ మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామంలో శిథిలావస్థకు చేరిన కొల్లాపురమ్మ దేవాలయం అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి రూ. 20 లక్షలు మంజూరు చేయడంతో సిఎం జగన్‌కు స్థానిక ఎస్సీ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, కొత్తపల్లి సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపిపి రామకృష్ణారెడ్డిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచి రమేష్, వైసిపి నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఆర్.కొత్తపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాపు










