Mar 01,2022 21:38

గోడపత్రికను విడుదల చేస్తున్న ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

ప్రజాశక్తి- చిన్నగొట్టిగల్లు: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఆమోదించడానికి కషిచేసేందుకు విజయవాడలో మార్చి ఐదున జరిగే తెలుగు రాష్ట్రాల మాదిగ సంఘాల ఐక్యవేదిక సదస్సుకు మాదిగలందరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఎంఆర్‌పిఎస్‌ కార్యదర్శి గురుశంఖర్‌ మాదిగ పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగే ఈ సదస్సుకు ఏపియమ్మార్పియస్‌ అద్యక్షుడు, తెలుగు రాష్ట్రాల ఛైర్మన్‌ పేరిపోగు వెంకటేశ్వరరావు పాల్గొననున్నారు. సదస్సు అనంతరం అన్ని రాజకీయ పార్టీల మాదిగ ప్రజా ప్రతినిధులతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను గురుశంఖర్‌ మాదిగ స్థానిక నాయకులు వెంకటస్వామి, నాగార్జున, రాసారాయులు, రమణ, దేవేంద్రలతో కలిసి విడుదల చేసారు.