Mar 23,2023 21:09

ప్రజాశక్తి - పోడూరు
కార్మికుల సమస్యలపై ఏప్రిల్‌ 5న జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కేతా గోపాలన్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోడూరులో రౌండ్‌టేబుల్‌ సమావేశం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి బొంతు శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ముడే మోజేష్‌, సిఐటియు మండల అధ్యక్షులు బూరాబత్తుల వెంకట్రావు, జిల్లా కమిటీ సభ్యులు పిల్లి ప్రసాద్‌ పాల్గొన్నారు.