మార్కెట్ యార్టు ఛైర్మన్‌ను సన్మానిస్తున్న దృశ్యం
అనంతపురం : అనంతపురం నగరంలోని లలిత కళాపరిషత్ ఎదురుగా కారు ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిపిఎం ఒకటవ డివిజన్ కార్యదర్శి వి.రామిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ నగరంలో వివిధ పనుల నిమిత్తం సుదూర ప్రాంతాలు నుంచి వచ్చే ప్రజల దాహార్తి తీర్చడం కోసం సిఐటియు అనుబంధ కారు డ్రైవర్స్, ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు లతీఫ్, కారు డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు.










