May 09,2022 10:42

చిత్తూరు : చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్‌ రెడ్డి ఐపిఎస్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది కలిసి ఒక ప్రత్యేక డ్రైవ్‌ను సోమవారం నిర్వహించారు. ఈ డ్రైవ్‌ లో హైవేలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ ల వద్ద అనుమానితులను, కొత్త వ్యక్తులను తనిఖీ చేసి వారి వివరాలను సేకరిస్తున్నారు. స్వయంగా జిల్లా ఎస్‌పి చిత్తూరు రైల్వేస్టేషన్‌ వద్ద పోలీసు అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న ప్రయాణీకులను విచారించారు. పరిసర ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.