Feb 24,2022 15:42

ప్రజాశక్తి-చిత్తూరు : ప్రజలను మాటలతో మభ్యపెట్టి, వారి దృష్టిని మరల్చి దొంగతనాలకు పాల్పడే మహిళా దొంగల ముఠాను గురువారం చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి సుమారు 50 లక్షల రూపాయల విలువైన ఒక కేజీ బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయల విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా, డిఐజి సెంథిల్ కుమార్, ఐపిఎస్ ఆదేశాల మేరకు చిత్తూరు డి.యస్.పి సుధాకర్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో చిత్తూర్ ఒకటవ పట్టణ ఇన్స్ పెక్టర్ శ్రీ.నరసింహరాజు, చిత్తూర్ రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బాలయ్య మరియు పాకాల సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఆశీర్వాదంల ఆద్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి దృష్టి మరల్చి చోరికి పాల్పడే ముఠాను అరెస్టు చేశారు.  తేది ఉదయం చిత్తూర్ ఆర్టీసీ బస్సు స్టాండ్, పూతలపట్టు-రంగంపేట క్రాస్, తుగుండ్రం క్రాస్ వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగ సొత్తు బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకున్నారు. ఈ దొంగల ముఠా గుడిపాల, యాదమరి, పూతలపట్టు, సోమల మరియు పెనుమూరు మండలాలలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడమైనది. వీరిలో ముగ్గురు ఇంతకు ముందు కూడా పలు కేసులలో ముద్దాయిలుగా వున్నారు.