ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి కొత్త జిల్లాలు ఉనికిలోని వచ్చాయి. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి విడుదల చేసిన తుది గెజిట్ నోటిపికేషన్ ఆధారంగా నూతన జిల్లా కేంద్రాల్లో అధికారయంత్రాంగం నేటి నుండి విధులు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో గెజిట్‌లో పేర్కొన్న కలెక్టరేట్లలో సోమవారం ఉదయం కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించాలని పేర్కొన్నారు. కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొట్టమొదటి అధికారిక కార్యక్రమంగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిఎం కార్యాలయంలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కొత్త జిల్లాల కలెక్టర్లకు సిఎం అభినందనలు తెలియచేసి, ప్రభుత్వ పాలనా ప్రాధాన్యతల గురించి దిశా నిర్ధేశం చేశారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే కలెక్టర్లు జిల్లాలోని వివిధ స్థాయిల అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ నియామకం
చిత్తూరు ఎస్పీగా రిశాంత్‌రెడ్డి నియామకం

జిల్లా కేంద్రం: చిత్తూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమలేరు, కుప్పం, పుంగనూరు). రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త). మండలాలు: 31
నగరి డివిజన్‌లో మండలాలు: నగరి, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పాలసముద్రం, కార్వేటినగరం, నిండ్ర, విజయపురం
చిత్తూరు డివిజన్‌లో మండలాలు: చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, తవణంపల్లె, ఈరాల, పులిచెర్ల, రొంపిచర్ల
పలమనేరు డివిజన్‌లో మండలాలు: పలమనేరు, గంగవరం, పెదపంజాని, సోమ్ల, చౌడుపల్లి, పుంగనూరు, సదుం, బంగారుపాలెం, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట
కుప్పం డివిజన్‌లో మండలాలు: కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం
విస్తీర్ణం: 6,855 చ.కి.మీ. జనాభా: 18.730 లక్షలు










