చిత్తూరు : నూతనంగా నియమితులైన ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ ను కలెక్టర్ కార్యాలయంలో గౌరవ పూర్వకంగా సోమవారం కలిశారు. జడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జడ్పి సిఈఓ ప్రభాకర రెడ్డి లు కలిసి చిత్తూరు జిల్లాకు నియమితులైన జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, ఎస్పీ రిశాంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ లను కలెక్టర్ ఛాంబర్ లో కలసి పుష్పగుచ్చాలను అందచేశారు.










