
ఆకుపచ్చని ఆకాశహార్మ్యాలు..

నిత్యం ప్రకృతితో మమేకమవుతూ... ప్రకృతి మధ్య నివాసముండాలని కోరుకునే ప్రకృతి ప్రేమికులు ఎందరో... సరిగ్గా అలాంటి వారి కోసమే అన్నట్లు ఆకాశాన్ని తాకే ఎత్తయిన భవంతులు... ప్రకృతి వనాలను తలపిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులనూ అబ్బురపరుస్తున్నాయి. ఓ వైపు ఎత్తయిన, మెలితిరిగిన అద్దాల మేడలు.. మధ్యలో ప్రకృతి వనాలు.. వాటి మధ్య పక్షుల కిలకిలా రావాలు.. చూడముచ్చటైన ఆ అద్భుత ఆకుపచ్చని ఆకాశహార్మ్యాలపై ఓ లుక్కేయండి...



